Oil Palm Cultivation | ఒక్కసారి పెట్టుబడితో 30 ఏండ్ల వరకు ఆదాయం.. సబ్సిడీపై డ్రిప్‌, ఉచితంగా మొక్కలు

Oil Palm Cultivation | ఆయిల్‌ పామ్‌ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు.

Oil Palm Cultivation | ఆయిల్‌ పామ్‌ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ సాగు కోసం ఒక్కసారి పెట్టుబడి పెట్టి.. కేవలం మూడేండ్లు శ్రమిస్తే.. 30 ఏండ్లపాటు ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఉద్యానవన శాఖ సైతం రైతులను ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో ఈ ఏడాది 5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 75 ఎకరాల్లో తోటలు సాగవుతుండగా, మరో 250 ఎకరాల్లో త్వరలో సాగు మొదలుకానున్నది.

ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయి సర్వే అనంతరం మంజూరు చేస్తున్నారు. మొక్కలను ఉచితంగా అందజేయడంతోపాటు రాయితీపై డ్రిప్‌లు కూడా అందించి తోటల సాగుకు జిల్లా రైతాంగం ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తున్నారు. 2023-24 సంవత్సరంలో జిల్లా పరిధిలో 5వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని కార్యాచరణను రూపొందించారు. ఆయిల్‌ పామ్‌ విస్తరణ, నర్సరీల నిర్వహణ, గెలల ప్రాసెసింగ్‌ బాధ్యతలను వాల్యూ ఆయిల్‌ పామ్‌ కంపెనీ చూసుకోనుంది.

రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయడంతోపాటు, పండించిన పంటలను సైతం ఈ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌కు పంపనున్నది.ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ ఆయిల్‌ పామ్‌ కాయలకు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. ఈ లెక్కన ఖర్చులు పోను ఎకరాకు రూ.1.20లక్షల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

-రంగారెడ్డి, డిసెంబర్‌ 13(నమస్తే తెలంగాణ)

రంగారెడ్డి, డిసెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ): ‘ఆయిల్‌ పామ్‌ సాగుపై జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, లాభాలు తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు. మూడేండ్లు శ్రమిస్తే 30 ఏండ్లపాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పామ్‌ సాగు వైపు ఉద్యానవన శాఖ సైతం రైతులను మళ్లిస్తున్నది. పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువగా ఉండడం.. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 5వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టాల ని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు 75 ఎకరాల్లో తోటలు సాగవుతున్నా యి. మరో 250 ఎకరాల్లో సాగు మొదలుకానున్నది. ఆసక్తి ఉన్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయి సర్వే అనంతరం మంజూ రు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

వాల్యూ ఆయిల్‌ కంపెనీకి బాధ్యతలు

మారుతున్న పరిస్థితులు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను సాగు చేయాలని ప్రభు త్వం సంకల్పిస్తున్నది. ఈ తరుణంలో మార్కెట్‌లో పెరుగుతున్న ఆయిల్‌ ధరలతో పాటు వినియోగం పెరిగిన కారణంగా విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా జరుగుతున్న దిగుమతులను అరికట్టడానికి రైతులను ఆయిల్‌ పామ్‌ తోటల సాగు వైపు మళ్లిస్తున్నది. ఇందుకోసం మొక్కలను ఉచితంగా అందజేయడంతోపాటు రాయితీలు కూడా కల్పించి తోటల సాగుకు జిల్లా రైతాంగం ముందుకొచ్చేలా చైతన్యపరుస్తున్నది.

2023-24 సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 5వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగును చేపట్టాలని కార్యాచరణను రూపొందించింది. ఆయిల్‌ పామ్‌ విస్తరణ, నర్సరీల నిర్వహణ, గెలల ప్రాసెసింగ్‌ బాధ్యతలను వాల్యూ ఆయిల్‌ పామ్‌ కంపెనీ చూసుకోనున్నది. రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేయడంతోపాటు, పండించిన పంటలను సైతం ఈ సంస్థనే కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌కు పంపనున్నది.

ఎకరాకు రూ.1.20 లక్షల ఆదాయం!

నీరు సమృద్ధిగా ఉన్న సారవంతమైన నేలలో ఆయిల్‌ పామ్స్‌ సాగు చేస్తే నాలుగేండ్ల నుంచి 30 ఏండ్ల వరకు నిరంతర ఆదాయం పొందవచ్చు. నాలుగేండ్ల తర్వాత దిగుబడులు మొదలవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌ ఆయిల్‌ పామ్‌ కాయలకు టన్నుకు రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. ఈ లెక్కన ఖర్చులు పోనూ ఎకరాకు రూ.1.20లక్షల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. డ్రిప్‌ ద్వారా మొక్కలు ఎండిపోకుండా నీరు సమృద్ధిగా అందిస్తే దిగుబడులు మరింతగా వస్తాయంటున్నారు.

మొదటి సంవత్సరం కొంత పెట్టుబడి కాగా.. రెండో సంవత్సరం నుంచి కాత వచ్చే వరకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. మూడేండ్ల వరకు మొక్కల మధ్య మొక్క జొన్న, మిరప, పూలు, పెసలు, మినుములు, నువ్వులు, కూరగాయలను అంతరపంటగానూ సాగు చేసుకోవచ్చు. అకాల వర్షాలు, గాలి బీభత్సం వచ్చినా తోటలకు నష్టం ఉండదని, పశువులు, కోతులు కూడా పంటలను నష్టపర్చలేవని అధికారులు చెబుతున్నారు.

రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

జిల్లా రైతులు ఆయిల్‌ పామ్‌ వైపు దృష్టిసారించాలి. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఈ పంట మన ప్రాంతానికి కొత్త అయినప్పటికీ.. ఇక్కడి వాతావరణం, భూములు అనుకూలంగా ఉన్నాయి. మొక్కలు నాటడం, సస్యరక్షణ చర్యలు, పంటల విక్రయాల వరకు ఉద్యాన శాఖ అండగా ఉంటుంది. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి ఎప్పటికప్పుడు మంజూరు ఇస్తున్నాం. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి.

– నీరజ గాంధీ, ఇన్‌చార్జి జిల్లా ఉద్యావన శాఖ అధికారిణి, రంగారెడ్డి జిల్లా

రాయితీ ప్రోత్సాహకాలు

ఆయిల్‌ పామ్‌ సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు అవసరం ఉండగా ప్రస్తుతం వాటిని పూర్తి ఉచితంగా అందజేస్తున్నది. డ్రిప్‌ సిస్టమ్‌ కోసం బీసీలకు 90 శాతం సబ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇస్తున్నది. పన్నెండున్నర ఎకరాల వరకు రైతులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందే అవకాశం ఉంది. పంట ఎదుగుదల కాలంలోనూ కొంత నగదును ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తున్నది.

Recommended Posts